Song » Raa digiraa divinunchi / రా దిగిరా దివినుంచి
Song Details:Actor :
Chandra Mohan / చంద్రమోహన్ ,Actress :
Jayaprada / జయప్రద ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
rA digirA divinuMci Buviki digirA ||rA digirA|| rAma harE SrIrAma harE ||2| rAti bommaku ravvalu podigina rAma harE SrIrAma harE rAti bommaku ravvalu podigi rAma harE SrErAma harE ani paTTina harati cUstU EmI paTTanaTTu kUrcuMTE cAladu ||rA digirA|| alanATi A sIta InATi dEvata SatakOTi sItala kalabOta I dEvata rAmacaMdruDA kadalirA rAmabANamE vadalarA I GOra kalini mAparA I krUra balini AparA ||rA digirA|| naTarAjA Sata sahasra ravitEjA naTagAyaka vai tAlika munijana BOjA ||naTarAja|| dInAvana BavyakaLAdivya padAMBOjA ceri sagamai rasajagamai celagina nI celi prANamu balipaSuvai yajNavATi veli bUDida ayina kShaNamu satI viyOgamu sahiMcaka durmatiyau dakShuni madamaDaMcaga Dhama Dhama Dhama Dhama Damaruka dvanula namaka camaka yamagamaka layaMkara sakalalOka jarjarita BayaMkara vikaTa naTatpada visPu liMgamula vilaya tAMDavamu salipina nIvE SilavE ayitE pagilipO SivuDE ayitE ragilipO
రా దిగిరా దివినుంచి భువికి దిగిరా ||రా దిగిరా|| రామ హరే శ్రీరామ హరే ||౨| రాతి బొమ్మకు రవ్వలు పొదిగిన రామ హరే శ్రీరామ హరే రాతి బొమ్మకు రవ్వలు పొదిగి రామ హరే శ్రేరామ హరే అని పట్టిన హరతి చూస్తూ ఏమీ పట్టనట్టు కూర్చుంటే చాలదు ||రా దిగిరా|| అలనాటి ఆ సీత ఈనాటి దేవత శతకోటి సీతల కలబోత ఈ దేవత రామచంద్రుడా కదలిరా రామబాణమే వదలరా ఈ ఘోర కలిని మాపరా ఈ క్రూర బలిని ఆపరా ||రా దిగిరా|| నటరాజా శత సహస్ర రవితేజా నటగాయక వై తాలిక మునిజన భోజా ||నటరాజ|| దీనావన భవ్యకళాదివ్య పదాంభోజా చెరి సగమై రసజగమై చెలగిన నీ చెలి ప్రాణము బలిపశువై యజ్ణవాటి వెలి బూడిద అయిన క్షణము సతీ వియోగము సహించక దుర్మతియౌ దక్షుని మదమడంచగ ఢమ ఢమ ఢమ ఢమ డమరుక ద్వనుల నమక చమక యమగమక లయంకర సకలలోక జర్జరిత భయంకర వికట నటత్పద విస్ఫు లింగముల విలయ తాండవము సలిపిన నీవే శిలవే అయితే పగిలిపో శివుడే అయితే రగిలిపో