Song » Urike chilakaa / ఉరికే చిలకా
Song Details:Actor :
Arvind Swamy / అరవింద్ స్వామి ,Actress :
Manisha Koirala / మనీషా కొయిరాలా ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Chitra / చిత్ర ,
Hari Haran / హరిహరన్ ,Song Category : Others
pallavi: urikae chilakaavaechivuMTaanu kaDavaraku kurisae chinukaa elluvainaaveedavaraku chelivai sakhivai reMDu hRdayaala kathalu vinu bratukae baruvai niMDu virahaala kaburu vinu kaaTuka kaLLatO kaaTu vaeSaavu nannepuDO kaalaM chellitae iMta mannaesipO ipuDu urikae chilakaa vaechi vuMTaanu kaDavaraku kurisae chinukaa elluvainaave edavaraku charaNaM : 1 nee raaka kOsaM tolipraaNamaina daachiMdi naa valapae manasaMTi maguva ae jaamu raaka chitimaMTalae raepae naa kaDapraaNaM pOnivvu katha maasipOdu adi kaadu naa vaedana vidhi vipareetaM nee meeda apavaadu vaestae eda kuMgi pOyaenulae modalO tudalO vadilaeSaanu neekae priyaa urikae chilakae vachchi vaaliMdi kalata viDi cheligaa sakhilaa taanu chaeriMdi cheluni oDi nelavae telipae ninnu chaeriMdi gatamu viDi kalakai ilakai ooyaloogiMdi kaMTapaDi kaaTuka kaLLatO kaaTu vaeSaavu nannepuDO kaalaM chellitae iMta mannaesipO ipuDu urikae chilakaa vaechi vuMTaanu kaDavaraku kurisae chinukaa elluvainaave edavaraku charaNaM : 2 aa aa aa... tolipraaNamaina okanaaTi praema maasaedi kaadu sumaa oka kaMTi geetaM jalapaatamaitae maru kannu navvadammaa naa paruvaala paradaalu tolagiMchi vastae kanneeTi muDupaayenae nae purivippi parugetti gaalalle vachchaa nee vaeNugaanaanikae arerae.. arerae.. naeDu kanneeTa taene kalisae urikae chilakaa vaechi vuMTaanu kaDavaraku kurisae chinukaa elluvainaave edavaraku chelivai sakhivai reMDu hRdayaala kathalu vinu bratukae baruvai niMDu virahaala kaburu vinu mohamO maikamO reMDu manasullO virisinadi paaSamO baMdhamO unna dooraalu cheripinadi urikae chilakae vachchi vaaliMdi kalata viDi nelavae telipae ninnu chaeriMdi gatamu viDi Click here to hear the song
పల్లవి: ఉరికే చిలకా వేచివుంటాను కడవరకు కురిసే చినుకా ఎల్లువైనావెఎదవరకు చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను కాటుక కళ్ళతో కాటు వేశావు నన్నెపుడో కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడు ఉరికే చిలకా వేచి వుంటాను కడవరకు కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు చరణం : 1 నీ రాక కోసం తొలిప్రాణమైన దాచింది నా వలపే మనసంటి మగువ ఏ జాము రాక చితిమంటలే రేపే నా కడప్రాణం పోనివ్వు కథ మాసిపోదు అది కాదు నా వేదన విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే ఎద కుంగి పోయేనులే మొదలో తుదలో వదిలేశాను నీకే ప్రియా ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి చెలిగా సఖిలా తాను చేరింది చెలుని ఒడి నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి కలకై ఇలకై ఊయలూగింది కంటపడి కాటుక కళ్ళతో కాటు వేశావు నన్నెపుడో కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడు ఉరికే చిలకా వేచి వుంటాను కడవరకు కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు చరణం : 2 ఆ ఆ ఆ... తొలిప్రాణమైన ఒకనాటి ప్రేమ మాసేది కాదు సుమా ఒక కంటి గీతం జలపాతమైతే మరు కన్ను నవ్వదమ్మా నా పరువాల పరదాలు తొలగించి వస్తే కన్నీటి ముడుపాయెనే నే పురివిప్పి పరుగెత్తి గాలల్లె వచ్చా నీ వేణుగానానికే అరెరే.. అరెరే.. నేడు కన్నీట తేనె కలిసే ఉరికే చిలకా వేచి వుంటాను కడవరకు కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను మొహమో మైకమో రెండు మనసుల్లో విరిసినది పాశమో బంధమో ఉన్న దూరాలు చెరిపినది ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
