Song » Takita Tadhimi / తకిట తధిమి
Song Details:Actor :
Kamal Haasan / కమల్ హాసన్ ,Actress :
Jayaprada / జయప్రద ,Music Director :
Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
a: takiTa tadhimi takiTa tadhimi taMdAnA hRudaya layala jatula gatula tillAnA ||takiTa tadhimi|| taDabaDu aDugula tappani tALAna taDisina pedavula rEgina rAgAna ||taDabaDu|| SRutini layanu okaTi cEsi ||takiTa tadhimi|| naruDi bratuku naTana ISvaruDi talapu GaTana A reMTi naTTa naDuma nI keMdukiMta tapana ||naruDi|| telusA manasA nIkidi telisI alusA telisI teliyani ASala vayasI varasA telusA manasA nIkidi telisI alusA telisI teliyani ASala lAlalA.... lalalA ETilOni alalavaMTi kaMTilOni kalalu kadipi guMDi yalanu aMdiyaluga cEsi ||takiTa tadhimi|| palukurAga madhuraM nI bratuku nATyaSiKaraM saptagirulugA velisE susvarAla gOpuraM ||palu|| alarulu kuriyaganADinadE alakala kulukula alamElmaMgA ||alarula|| anna annamayya mATa acca tEne tenugupATa pallaviMcu pada kavitalu pADI || takiTa|| A.... A....A... Click here to hear the song
అ: తకిట తధిమి తకిట తధిమి తందానా హృదయ లయల జతుల గతుల తిల్లానా ||తకిట తధిమి|| తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన ||తడబడు|| శృతిని లయను ఒకటి చేసి ||తకిట తధిమి|| నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆ రెంటి నట్ట నడుమ నీ కెందుకింత తపన ||నరుడి|| తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా తెలిసీ తెలియని ఆశల వయసీ వరసా తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా తెలిసీ తెలియని ఆశల లాలలా.... లలలా ఏటిలోని అలలవంటి కంటిలోని కలలు కదిపి గుండి యలను అందియలుగ చేసి ||తకిట తధిమి|| పలుకురాగ మధురం నీ బ్రతుకు నాట్యశిఖరం సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం ||పలు|| అలరులు కురియగనాడినదే అలకల కులుకుల అలమేల్మంగా ||అలరుల|| అన్న అన్నమయ్య మాట అచ్చ తేనె తెనుగుపాట పల్లవించు పద కవితలు పాడీ || తకిట|| ఆ.... ఆ....ఆ... ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
