Song » Ennello mutyamaa / ఎన్నెల్లో ముత్యమా
Song Details:Actor :Actress :
Sudhachandran / సుధాచంద్రన్ ,Music Director :
S.P. Balasubrahmanyam / యస్.పి. బాలసుబ్రహ్మణ్యం ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,
S. Janaki / యస్. జానకి ,Song Category : Others
bRuMdaM: ennellO mutyamA eMDallO padmamA cIkaTlO dIpamA sirikE pratirUpamA E pErO E UrO ceppavammA telugiMTi kalikaMTi tEnelamma ceppavammA tEnelammA.... ceppavammA tEnelammA a : mahAkavi gurajADa mAnasa putrikavu nIvu puttaDibommavA pUrNammavA! A: nA kannulu kaluvala rEkalani nA aDugulu haMsala rAkalani nA palukulu tEnela vAkalani telisi telisi eMta vagacinA tAtatOne muDipeTTAru tALitOne uritISAru ammallArA akkallArA AkASaMlO O cukkallArA nelakokasAri vastU unnA niMDuga punnaminai mIlOnE jIvistunnA puttaDibomma pUrNammanai.... puttaDibomma pUrNammanai a: viSvanAdhuni cEta tolinATi kavitavai viritEniyalu poMgu selayETi vanitavai velugoMdu telugu jilugula rANivi avunu! kinnerasAnivi A: toluta nA kannIru kAlvalai pAriMdi pidapa adi vAgulai vaMkalai poMgiMdi taragalai nurugulai taragalE paDagalai paDagalE aDugulai aDugulE maDugulai parugulettina dAnini nEnu paruvAla dorasAnini koDuku daSanE dATimagaDu kAlEni oka paDucuvADiki tagani gaDusu illAlini nEnu kinnerasAnini peLLaina telugu kannela sATini nEnu kinnerasAnini peLLaina telugu kannela sATini a: evvareruganidamma naMDUri eMkI pUvulA navvETi telugu pUbaMtI A: kaDavAkaina lEdu toDimaMta eDamu eDameTTA guMTAdi piDikeDE naDumu ||kaDavAkaina|| mabbuteranE viDice vaMka jAbilli ubbarAla raikalebbebbarilli bRuMdaM: abbalAlO....Emi nibbarAlO A: jArupaiTE cAlu jAvaLIpATa bRuMdaM: lA lA la la lA lA lA A: nAyiDOri jANA naDicETi vINA vennu taDitE cAlu vennellu karugu gOvu podugullOnA gOdAri poMgu ennelammani ciliki EDu mallela kodigi telugiMTapuTTiMdi elugaMTi eMki telugallE edigiMdi cilakaMTi eMki elugaMTi eMki cilakaMTi eMki bRuMdaM: elugaMTi eMki cilakaMTi eMki || elugaMTi ||
బృందం: ఎన్నెల్లో ముత్యమా ఎండల్లో పద్మమా చీకట్లో దీపమా సిరికే ప్రతిరూపమా ఏ పేరో ఏ ఊరో చెప్పవమ్మా తెలుగింటి కలికంటి తేనెలమ్మ చెప్పవమ్మా తేనెలమ్మా.... చెప్పవమ్మా తేనెలమ్మా అ : మహాకవి గురజాడ మానస పుత్రికవు నీవు పుత్తడిబొమ్మవా పూర్ణమ్మవా! ఆ: నా కన్నులు కలువల రేకలని నా అడుగులు హంసల రాకలని నా పలుకులు తేనెల వాకలని తెలిసి తెలిసి ఎంత వగచినా తాతతోనె ముడిపెట్టారు తాళితోనె ఉరితీశారు అమ్మల్లారా అక్కల్లారా ఆకాశంలో ఓ చుక్కల్లారా నెలకొకసారి వస్తూ ఉన్నా నిండుగ పున్నమినై మీలోనే జీవిస్తున్నా పుత్తడిబొమ్మ పూర్ణమ్మనై.... పుత్తడిబొమ్మ పూర్ణమ్మనై అ: విశ్వనాధుని చేత తొలినాటి కవితవై విరితేనియలు పొంగు సెలయేటి వనితవై వెలుగొందు తెలుగు జిలుగుల రాణివి అవును! కిన్నెరసానివి ఆ: తొలుత నా కన్నీరు కాల్వలై పారింది పిదప అది వాగులై వంకలై పొంగింది తరగలై నురుగులై తరగలే పడగలై పడగలే అడుగులై అడుగులే మడుగులై పరుగులెత్తిన దానిని నేను పరువాల దొరసానిని కొడుకు దశనే దాటిమగడు కాలేని ఒక పడుచువాడికి తగని గడుసు ఇల్లాలిని నేను కిన్నెరసానిని పెళ్ళైన తెలుగు కన్నెల సాటిని నేను కిన్నెరసానిని పెళ్ళైన తెలుగు కన్నెల సాటిని అ: ఎవ్వరెరుగనిదమ్మ నండూరి ఎంకీ పూవులా నవ్వేటి తెలుగు పూబంతీ ఆ: కడవాకైన లేదు తొడిమంత ఎడము ఎడమెట్టా గుంటాది పిడికెడే నడుము ||కడవాకైన|| మబ్బుతెరనే విడిచె వంక జాబిల్లి ఉబ్బరాల రైకలెబ్బెబ్బరిల్లి బృందం: అబ్బలాలో....ఏమి నిబ్బరాలో ఆ: జారుపైటే చాలు జావళీపాట బృందం: లా లా ల ల లా లా లా ఆ: నాయిడోరి జాణా నడిచేటి వీణా వెన్ను తడితే చాలు వెన్నెల్లు కరుగు గోవు పొదుగుల్లోనా గోదారి పొంగు ఎన్నెలమ్మని చిలికి ఏడు మల్లెల కొదిగి తెలుగింటపుట్టింది ఎలుగంటి ఎంకి తెలుగల్లే ఎదిగింది చిలకంటి ఎంకి ఎలుగంటి ఎంకి చిలకంటి ఎంకి బృందం: ఎలుగంటి ఎంకి చిలకంటి ఎంకి || ఎలుగంటి ||
