![]() |
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Jayanthi / జయంతి ,
Sridevi / శ్రీదేవి ,Music Director :
K.Chakravarthi / కె.చక్రవర్తి ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
P.Suseela / పి. సుశీల ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
I madhumaasaMlO I darahaasaMlO madilO kadili palikE kOyila bratukE haayiga I madhumaasaMlO I darahaasaMlO madilO kadili palikE kOyila bratukE haayiga aakaashaM aMculu daaTE aavEshaM naa gItaM aMdulOni prati akSharamu aMdamaina nakShatraM aa gItaM palikina naa jIvitamE saMgItaM saMgamiMcu praNayaMlO udayaraaga siMdhUraM prEmE pennidhigaa daivaM sannidhigaa prEmE pennidhigaa daivaM sannidhigaa samashRutilO jata kalisi priyalayalO adamaraci anuraagaalu palikiMcuvELa I madhumaasaMlO I darahaasaMlO madilO kadili palikE kOyila bratukE haayiga aMdamaina mana illu avani mIda harivillu Rutuvulenni maarinaa vasaMtaalu vedajallu telavaarina saMdhyalalO tEne nITi vaDagaLLu j~jaapakaala nIDalalO karugutunna kannILLu okaTE Upirigaa kalalE cUpulugaa okaTE Upirigaa kalalE cUpulugaa manasulalO manaserigi mamatalanE madhuvolikE shubhayOgaalu tilakiMcuvELa I madhumaasaMlO I darahaasaMlO madilO kadili palikE kOyila bratukE haayiga
ఈ మధుమాసంలో ఈ దరహాసంలో మదిలో కదిలి పలికే కోయిల బ్రతుకే హాయిగ ఈ మధుమాసంలో ఈ దరహాసంలో మదిలో కదిలి పలికే కోయిల బ్రతుకే హాయిగ ఆకాశం అంచులు దాటే ఆవేశం నా గీతం అందులోని ప్రతి అక్షరము అందమైన నక్షత్రం ఆ గీతం పలికిన నా జీవితమే సంగీతం సంగమించు ప్రణయంలో ఉదయరాగ సింధూరం ప్రేమే పెన్నిధిగా దైవం సన్నిధిగా ప్రేమే పెన్నిధిగా దైవం సన్నిధిగా సమశృతిలో జత కలిసి ప్రియలయలో అదమరచి అనురాగాలు పలికించువేళ ఈ మధుమాసంలో ఈ దరహాసంలో మదిలో కదిలి పలికే కోయిల బ్రతుకే హాయిగ అందమైన మన ఇల్లు అవని మీద హరివిల్లు ఋతువులెన్ని మారినా వసంతాలు వెదజల్లు తెలవారిన సంధ్యలలో తేనె నీటి వడగళ్ళు జ్ఞాపకాల నీడలలో కరుగుతున్న కన్నీళ్ళు ఒకటే ఊపిరిగా కలలే చూపులుగా ఒకటే ఊపిరిగా కలలే చూపులుగా మనసులలో మనసెరిగి మమతలనే మధువొలికే శుభయోగాలు తిలకించువేళ ఈ మధుమాసంలో ఈ దరహాసంలో మదిలో కదిలి పలికే కోయిల బ్రతుకే హాయిగ
