Song » VEnugana / వేణు గాన
Song Details:Actor :
Srikanth / శ్రీకాంత్ ,Actress :
Laya / లయ ,Music Director :
Vidya Sagar / విద్యాసాగర్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Shankar Mahadevan / శంకర్ మహాదేవన్ ,
Sujatha / సుజాత ,Song Category : Others
sAkI: kastUrI tilakaM lalATa PalakE vakShasdhalE kaustuBaM nAsAgrE nava mauktikaM karatalE vENuM pa||vENu gAna sammOhanaM _vElimIda gOvardhanaM vrEpallE mA naMdanaM_ vEnOLLa nI kIrtanaM a||pa|| AShADa mEGAlocci AnaMdAla jallE kurisE AlArE...||vENu|| ca: pAlacaTTi nettineTTi ammabOtE kiTTayyA ElupeTTi eMgili cEttaDu...eTTAgammO..iMkeTTagammo mATucUsi maDulOna munagabOtE kiTTayya sIralu guMji sakkagOtaDu...eTTagammA..iMkeTTagammo Ere kOka nIrE raika aMTADammo vacanaM: aTtAgani aMTAmuTTanaTTu vuMdAmaMTE ca||muripAlu poMgistE pAleMdukaMTADu...Olammo siggocci cuTTEstE cIreMdukaMTADu...Olammo buTuku buTuku bugga gilli pOyinaTTu siTuku siTuku sinuku mudduliccinaTTu ||buTuku|| vayasu pacci tAkinaTTu_ manasu gicci pOyinaTTu AlArE AlArE AnaMdabAla aMdAla kiTTayyatO paMtAla hELa|| AlArE|| ||vENugAna|| ca:kRuShNA mukuMdA murArI naNda yaSOdAnaMdanunaku navamadana dEvunaku gObbiLLO caMdana carcita nIladEha gaganAla sogasuku gobbiLLO usurugAlulanu vedurupATalugA||2|| paluku vENuvuku gobbiLLO ETimIda ennellO ennelaMTi kannullO kannegaMTi sannallO sannajAji ginnellO vEdamaMtA vennalAgA karigE vELllO ||2|| E gIta bOdhistAvO evvari gIta mArustAvO naMdArE ||vENugAna||
సాకీ: కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్ధలే కౌస్తుభం నాసాగ్రే నవ మౌక్తికం కరతలే వేణుం ప||వేణు గాన సమ్మోహనం _వేలిమీద గోవర్ధనం వ్రేపల్లే మా నందనం_ వేనోళ్ళ నీ కీర్తనం అ||ప|| ఆషాడ మేఘాలొచ్చి ఆనందాల జల్లే కురిసే ఆలారే...||వేణు|| చ: పాలచట్టి నెత్తినెట్టి అమ్మబోతే కిట్టయ్యా ఏలుపెట్టి ఎంగిలి చేత్తడు...ఎట్టాగమ్మో..ఇంకెట్టగమ్మొ మాటుచూసి మడులోన మునగబోతే కిట్టయ్య సీరలు గుంజి సక్కగోతడు...ఎట్టగమ్మా..ఇంకెట్టగమ్మొ ఏరె కోక నీరే రైక అంటాడమ్మొ వచనం: అట్తాగని అంటాముట్టనట్టు వుందామంటే చ||మురిపాలు పొంగిస్తే పాలెందుకంటాడు...ఓలమ్మొ సిగ్గొచ్చి చుట్టేస్తే చీరెందుకంటాడు...ఓలమ్మొ బుటుకు బుటుకు బుగ్గ గిల్లి పోయినట్టు సిటుకు సిటుకు సినుకు ముద్దులిచ్చినట్టు ||బుటుకు|| వయసు పచ్చి తాకినట్టు_ మనసు గిచ్చి పోయినట్టు ఆలారే ఆలారే ఆనందబాల అందాల కిట్టయ్యతో పంతాల హేళ|| ఆలారే|| ||వేణుగాన|| చ:కృష్ణా ముకుందా మురారీ నణ్ద యశోదానందనునకు నవమదన దేవునకు గోబ్బిళ్ళో చందన చర్చిత నీలదేహ గగనాల సొగసుకు గొబ్బిళ్ళో ఉసురుగాలులను వెదురుపాటలుగా||౨|| పలుకు వేణువుకు గొబ్బిళ్ళో ఏటిమీద ఎన్నెల్లో ఎన్నెలంటి కన్నుల్లో కన్నెగంటి సన్నల్లో సన్నజాజి గిన్నెల్లో వేదమంతా వెన్నలాగా కరిగే వేళ్ల్లో ||౨|| ఏ గీత బోధిస్తావో ఎవ్వరి గీత మారుస్తావో నందారే ||వేణుగాన||
