Song » Premalae Nerama / ప్రేమలే నేరమా
Song Details:Actor :
Madhavan / మాధవన్ ,Actress :
Shalini / షాలిని ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Swarnalatha / స్వర్ణలత ,Song Category : Others
pallavi: prEmalE nEramA priyA priyA valapu virahamA O nA priyA manasu mamata AkASamA oka tArai merisina nIvekkaDO.. kalalai pOyenu nA prEmalU.. alalai poMgenu nA kannulU.. kalalai pOyenu nA prEmalU.. alalai poMgenu nA kannulU.. madiki atidhigA rAnElanO.. selavainA aDagaka pOnElanO.. eduru cUpuku nidarEdI.. UgEnu usurE kannIrai.. manasu aDigina maniShikkaDO.. nA pilupE aMdani dUralalO..O.. kalalai pOyenu nA prEmalU.. alalai poMgenu nA kannulU.. caraNaM 1: anurAgAniki svaramEdi.. sAgaraGOShaku pedavEdi anurAgAniki svaramEdi.. sAgaraGOShaku pedavEdi evarikivArE edurupaDi.. edalu ragulu eDabATulalO civariki dArE melikapaDi.. ninu cEraga nEnI Silanaitini eMDamAvilO nAvanu nEnai.. niTTUrpE nA teracApalE kalalai pOyEnu nA premalu.. alalai poMgenu nA kannulu caraNaM 2: vennela maMDina vEdanalO.. kaluva puvvula kalatapaDi cEsina bAsalu kalalaipOtE.. batukE mAyaga migulunanI nIkai vetika kaugilini.. nIDagA mArina valapulatO alasi unnAnu ASalatO.. nanu OdArcE nI pilupennaDO.. kalalai pOyenu nA prEmalU.. alalai poMgenu nA kannulU.. kalalai pOyenu nA prEmalU.. alalai poMgenu nA kannulU..
పల్లవి: ప్రేమలే నేరమా ప్రియా ప్రియా వలపు విరహమా ఓ నా ప్రియా మనసు మమత ఆకాశమా ఒక తారై మెరిసిన నీవెక్కడో.. కలలై పోయెను నా ప్రేమలూ.. అలలై పొంగెను నా కన్నులూ.. కలలై పోయెను నా ప్రేమలూ.. అలలై పొంగెను నా కన్నులూ.. మదికి అతిధిగా రానేలనో.. సెలవైనా అడగక పోనేలనో.. ఎదురు చూపుకు నిదరేదీ.. ఊగేను ఉసురే కన్నీరై.. మనసు అడిగిన మనిషిక్కడో.. నా పిలుపే అందని దూరలలో..ఓ.. కలలై పోయెను నా ప్రేమలూ.. అలలై పొంగెను నా కన్నులూ.. చరణం 1: అనురాగానికి స్వరమేది.. సాగరఘోషకు పెదవేది అనురాగానికి స్వరమేది.. సాగరఘోషకు పెదవేది ఎవరికివారే ఎదురుపడి.. ఎదలు రగులు ఎడబాటులలో చివరికి దారే మెలికపడి.. నిను చేరగ నేనీ శిలనైతిని ఎండమావిలో నావను నేనై.. నిట్టూర్పే నా తెరచాపలే కలలై పోయేను నా ప్రెమలు.. అలలై పొంగెను నా కన్నులు చరణం 2: వెన్నెల మండిన వేదనలో.. కలువ పువ్వుల కలతపడి చేసిన బాసలు కలలైపోతే.. బతుకే మాయగ మిగులుననీ నీకై వెతిక కౌగిలిని.. నీడగా మారిన వలపులతో అలసి ఉన్నాను ఆశలతో.. నను ఓదార్చే నీ పిలుపెన్నడో.. కలలై పోయెను నా ప్రేమలూ.. అలలై పొంగెను నా కన్నులూ.. కలలై పోయెను నా ప్రేమలూ.. అలలై పొంగెను నా కన్నులూ..
