Song » Swapna Venuvaedo / స్వప్న వేణువేదో
Song Details:Actor :
Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,
Jagapathi Babu / జగపతి బాబు ,Actress :
Anjala Zhaveri / అంజలా ఝవేరి ,Music Director :
Mani sharma / మణిశర్మ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Chitra / చిత్ర ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi : svapnavaeNuvaedO saMgeeta maalapiMchae suprabhaatavaeLaa Subhamastu gaali veechae jODainaa reMDu guMDelaa aeka taaLamO jOrainaa yavvanaalalO praema geetamO laelaetaa poola baasaloo.. kaalaevaa chaeti raataloo IIsvapnavaeNuvaedOII charaNaM : 1 neevae praaNaM.. neevae sarvaM.. neekai chae vennela jaagaaraM praemaa naenoo.. raeyi pagaloo.. haaraalallae mallelu neekOsaM kOTi chukkaloo ashTa dikkuloo ninnu choochu vaeLaa niMDu aaSalae reMDu kannulai choostaenaeraalaa kaalaalae aagipOyinaa.. gaanaalae moogabOvunaa charaNaM : 2 naalO mOhaM.. raegae daahaM.. daachaedepuDO pilichae kannullO ODae paMdeM.. gelichae baMdhaM.. reMDoo okaTae kalisae jaMTallO manishi neeDagaa manasu tODugaa maluchukunna baMdhaM penu tuphaanulae eduru vachchinaa chaeraalee teeraM vaaraevaa praema paavuraM.. vaalaedae praNaya gOpuraM IIsvapnavaeNuvaedOII
పల్లవి : స్వప్నవేణువేదో సంగీత మాలపించే సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే జోడైనా రెండు గుండెలా ఏక తాళమో జోరైనా యవ్వనాలలో ప్రేమ గీతమో లేలేతా పూల బాసలూ.. కాలేవా చేతి రాతలూ ॥స్వప్నవేణువేదో॥ చరణం : 1 నీవే ప్రాణం.. నీవే సర్వం.. నీకై చే వెన్నెల జాగారం ప్రేమా నేనూ.. రేయి పగలూ.. హారాలల్లే మల్లెలు నీకోసం కోటి చుక్కలూ అష్ట దిక్కులూ నిన్ను చూచు వేళా నిండు ఆశలే రెండు కన్నులై చూస్తేనేరాలా కాలాలే ఆగిపోయినా.. గానాలే మూగబోవునా చరణం : 2 నాలో మోహం.. రేగే దాహం.. దాచేదెపుడో పిలిచే కన్నుల్లో ఓడే పందెం.. గెలిచే బంధం.. రెండూ ఒకటే కలిసే జంటల్లో మనిషి నీడగా మనసు తోడుగా మలుచుకున్న బంధం పెను తుఫానులే ఎదురు వచ్చినా చేరాలీ తీరం వారేవా ప్రేమ పావురం.. వాలేదే ప్రణయ గోపురం ॥స్వప్నవేణువేదో॥
