Song » Yejanmado / ఏ జన్మదో
Song Details:Actor :
Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress :
Sobhana / శోభన ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Chitra / చిత్ర ,
MM. Keeravani / ఎమ్.ఎమ్ కీరవాణి ,Song Category : Love & Romantic Songs
ahaahaa lalalaa lala lala lala lala lala laa ahaahaa lalalaa lala lala lala lala lala laa E janmadO I saMbaMdhamU E raagamO I saMgItamU manasE kOrE maaMgalyaM tanuvE paMDE taaMbUlaM I prEma yaatralO E janmadO I saMbaMdhamU okari kOsaM okaru cUpE mamata I kaapuraM ciguru vEsE cilipi swaardhaM valapu maunaakSharaM peLLaaDukunna aMdaM veyyELLa tIpi baMdhaM maa iMTilOna paadaM palikiMcE prEma vEdaM aMdaala guDilOna pUjaarinO O baaTasaarinO E janmadO I saMbaMdhamU latalu reMDU virulu aarai verise bRuMdaavanI kalalu paMDI velugulaayE kalisi uMdaamanI vEsaMgi malle cilikE sItaMgi vELa cinukai hEmaMta siggulolikE kavviMtalaayE kalakE I pUla RutuvaMta aa tETidO I tOTamaalidO E janmadO I saMbaMdhamU E raagamO I saMgItamU manasE kOrE maaMgalyaM tanuvE paMDE taaMbUlaM I prEma yaatralO E janmadO I saMbaMdhamU
అహాహా లలలా లల లల లల లల లల లా అహాహా లలలా లల లల లల లల లల లా ఏ జన్మదో ఈ సంబంధమూ ఏ రాగమో ఈ సంగీతమూ మనసే కోరే మాంగల్యం తనువే పండే తాంబూలం ఈ ప్రేమ యాత్రలో ఏ జన్మదో ఈ సంబంధమూ ఒకరి కోసం ఒకరు చూపే మమత ఈ కాపురం చిగురు వేసే చిలిపి స్వార్ధం వలపు మౌనాక్షరం పెళ్ళాడుకున్న అందం వెయ్యేళ్ళ తీపి బంధం మా ఇంటిలోన పాదం పలికించే ప్రేమ వేదం అందాల గుడిలోన పూజారినో ఓ బాటసారినో ఏ జన్మదో ఈ సంబంధమూ లతలు రెండూ విరులు ఆరై వెరిసె బృందావనీ కలలు పండీ వెలుగులాయే కలిసి ఉందామనీ వేసంగి మల్లె చిలికే సీతంగి వేళ చినుకై హేమంత సిగ్గులొలికే కవ్వింతలాయే కలకే ఈ పూల ఋతువంత ఆ తేటిదో ఈ తోటమాలిదో ఏ జన్మదో ఈ సంబంధమూ ఏ రాగమో ఈ సంగీతమూ మనసే కోరే మాంగల్యం తనువే పండే తాంబూలం ఈ ప్రేమ యాత్రలో ఏ జన్మదో ఈ సంబంధమూ
