Song » Oh Prema Na Prema / ఓ ప్రేమా నా ప్రేమా
Song Details:Actor :
Venkatesh / వెంకటేష్ ,Actress :
Meena / మీనా ,Music Director :
Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Chitra / చిత్ర ,Song Category : Meloncholic Songs
O prEmaa naa prEmaa daivaalaaDE jUdaM dayyaMpaaDE vEdaM O prEmaa naa prEmaa prEmistE caavEnaa daivaalaaDE jUdaM dayyaMpaaDE vEdaM raktaMlOni suDiguMDaM raayaipOyE anubaMdaM O prEmaa naa prEmaa kShaNamoka yugamugaa gaDipina bratukidi telusukO priyatamaa virahamE suKamani kalayika kalayani talacuTE madhuramaa mRutulaku citulaku mugiyani kadhalivi kadaliraa praNayamaa aDugulu cilikina rudhiravu maDugula erupulE praLayamaa jaaripOyE kaalaM cEjaaripOyE yOgaM ragulutunna gaayaM nEnaDagalEnu nyaayaM karuvautaanu kannullO gurutuMTaanu guMDellO O prEmaa naa prEmaa daivaalaaDE jUdaM dayyaMpaaDE vEdaM raktaMlOni suDiguMDaM raayaipOyE anubaMdaM O prEmaa naa prEmaa girilanu viDicina nadulika venukaku tirugunaa jagamuna kulamani kaDudani kulamani viluvalu cerugunaa manasuna gaganamu merupula nagalanu toDigitE GanatalE perugunaa urumulu vinapaDi udayapu velugulu adurunaa cedurunaa pEdavaaLLa prEma kaaTuvEsE paamaa swaagataalu anagaa caavukainaa prEma maanai nEnu bratikunnaa maniShai nEnu castunnaa O prEmaa naa prEmaa daivaalaaDE jUdaM dayyaMpaaDE vEdaM raktaMlOni suDiguMDaM raayaipOyE anubaMdaM O prEmaa naa prEmaa Click here to hear the song
ఓ ప్రేమా నా ప్రేమా దైవాలాడే జూదం దయ్యంపాడే వేదం ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా దైవాలాడే జూదం దయ్యంపాడే వేదం రక్తంలోని సుడిగుండం రాయైపోయే అనుబందం ఓ ప్రేమా నా ప్రేమా క్షణమొక యుగముగా గడిపిన బ్రతుకిది తెలుసుకో ప్రియతమా విరహమే సుఖమని కలయిక కలయని తలచుటే మధురమా మృతులకు చితులకు ముగియని కధలివి కదలిరా ప్రణయమా అడుగులు చిలికిన రుధిరవు మడుగుల ఎరుపులే ప్రళయమా జారిపోయే కాలం చేజారిపోయే యోగం రగులుతున్న గాయం నేనడగలేను న్యాయం కరువౌతాను కన్నుల్లో గురుతుంటాను గుండెల్లో ఓ ప్రేమా నా ప్రేమా దైవాలాడే జూదం దయ్యంపాడే వేదం రక్తంలోని సుడిగుండం రాయైపోయే అనుబందం ఓ ప్రేమా నా ప్రేమా గిరిలను విడిచిన నదులిక వెనుకకు తిరుగునా జగమున కులమని కడుదని కులమని విలువలు చెరుగునా మనసున గగనము మెరుపుల నగలను తొడిగితే ఘనతలే పెరుగునా ఉరుములు వినపడి ఉదయపు వెలుగులు అదురునా చెదురునా పేదవాళ్ళ ప్రేమ కాటువేసే పామా స్వాగతాలు అనగా చావుకైనా ప్రేమ మానై నేను బ్రతికున్నా మనిషై నేను చస్తున్నా ఓ ప్రేమా నా ప్రేమా దైవాలాడే జూదం దయ్యంపాడే వేదం రక్తంలోని సుడిగుండం రాయైపోయే అనుబందం ఓ ప్రేమా నా ప్రేమా ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి