Tuesday, July 28, 2020

Saagara Sangamam » Om Namashivaaya      సాగర సంగమం » ఓం నమశ్శివాయ



Song » Om Namashivaaya / ఓం నమశ్శివాయ

Song Details:Actor : Kamal Haasan / కమల్ హాసన్ ,Actress : Jayaprada / జయప్రద ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : S. Janaki / యస్. జానకి ,Song Category : Devotional Songs
OM..A A A A A..
OM..A A A A A..
OM..
 
OM namashshivaaya..OM namashshivaaya..
caMdrakaLaadhara sahRudayaa..caMdrakaLaadhara sahRudayaa..
saaMdra kaLaa pUrNOdaya laya nilayaa!!
 
OM namashshivaaya..OM namashshivaaya..
 
paMcabhUtamulu muKa paMcakamai..aaru Rutuvulu aahaaryamulai..
paMcabhUtamulu muKa paMcakamai..aaru Rutuvulu aahaaryamulai..
 
prakRuti,paarvati nItO naDacina EDu aDugulE swara saptakamai..
 
sa ga ma da ni sa ga
da ma  da ni  sa ga ma
ga ga ga..
sa sa sa..
ni ga ma da sa ni da ma ga sa
 
nI dRukkulE aTu aShTa dikkulai..nI vaakkulE navarasammulai..
taapasa maMdaaraa..A A A A A A A..
nI maunamE..
dashOpaniShattulai ila velayaa!! 
 
OM..OM..
 
OM namashshivaaya..
 
 
trikaalamulu nI nEtratrayamai..caturvEdamulu praakaaramulai..
trikaalamulu nI nEtratrayamai..caturvEdamulu praakaaramulai..
 
gajamuKa ShaNmuKa pramadhaadulu nI saMkalpaaniki Rutvija varulai..
advaitamE nI aadi yOgamai..nI layalE I kaalagamanamai..
kailaasagirivaasa nI gaanamE..
jaMtra gaatramula shruti kalaya!!
 
OM..OM..OM namashshivaaya..
caMdrakaLaadhara sahRudayaa..caMdrakaLaadhara sahRudayaa..
saaMdra kaLaa pUrNOdaya laya nilayaa!!
 
Click here to hear the song
ఓం..ఆ ఆ ఆ ఆ ఆ..
ఓం..ఆ ఆ ఆ ఆ ఆ..
ఓం..
 
ఓం నమశ్శివాయ..ఓం నమశ్శివాయ..
చంద్రకళాధర సహృదయా..చంద్రకళాధర సహృదయా..
సాంద్ర కళా పూర్ణోదయ లయ నిలయా!!
 
ఓం నమశ్శివాయ..ఓం నమశ్శివాయ..
 
పంచభూతములు ముఖ పంచకమై..ఆరు ఋతువులు ఆహార్యములై..
పంచభూతములు ముఖ పంచకమై..ఆరు ఋతువులు ఆహార్యములై..
 
ప్రకృతి,పార్వతి నీతో నడచిన ఏడు అడుగులే స్వర సప్తకమై..
 
స గ మ ద ని స గ
ద మ  ద ని  స గ మ
గ గ గ..
స స స..
ని గ మ ద స ని ద మ గ స
 
నీ దృక్కులే అటు అష్ట దిక్కులై..నీ వాక్కులే నవరసమ్ములై..
తాపస మందారా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ..
నీ మౌనమే..
దశోపనిషత్తులై ఇల వెలయా!! 
 
ఓం..ఓం..
 
ఓం నమశ్శివాయ..
 
 
త్రికాలములు నీ నేత్రత్రయమై..చతుర్వేదములు ప్రాకారములై..
త్రికాలములు నీ నేత్రత్రయమై..చతుర్వేదములు ప్రాకారములై..
 
గజముఖ షణ్ముఖ ప్రమధాదులు నీ సంకల్పానికి ఋత్విజ వరులై..
అద్వైతమే నీ ఆది యోగమై..నీ లయలే ఈ కాలగమనమై..
కైలాసగిరివాస నీ గానమే..
జంత్ర గాత్రముల శ్రుతి కలయ!!
 
ఓం..ఓం..ఓం నమశ్శివాయ..
చంద్రకళాధర సహృదయా..చంద్రకళాధర సహృదయా..
సాంద్ర కళా పూర్ణోదయ లయ నిలయా!!
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Bheemla Nayak Title Song | Pawan Kalyan | Rana Daggubati | Saagar K Chandra | Trivikram | Thaman S | #BheemlaNayak #Pawankalyan

Read & Enjoy La La Bheema Song Lyrics Song Name - Bheemla Nayak Title Song Sung by - Thaman S, Sri Krishna , Prudhvi Chandra & Ram M...